శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో అఫ్గానిస్థాన్లో సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు కొట్టుకున్న విషయం తెలిసిందే. పాక్ విజయం సాధించిన అనంతరం అఫ్గానిస్థాన్ అభిమానులు రెచ్చిపోవడంతో ఇరుజట్ల అభిమానులు వాగ్వివాదానికి దిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.