అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యువ ఇంగ్లండ్ జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్‌లోని అంటిగ్వా వేదికగా జరిగిన సెమీ ఫైనల్‌లో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. తద్వారా వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకుని.. 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. టామ్ ప్రెస్ట్ సారథ్యంలోని జట్టు ఈ అద్భుతం చేసి అభిమానుల మనసులను పులకింపజేసింది.