అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ బ్యాంక్ ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ.. తాడిమర్రిలోని ఎస్‌బీఐ శాఖలో పనిచేస్తున్నారు. 2016లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి సమయంలో రూ.18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలను సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలంగా సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు చెలరేగి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిపైన మూడో అంతస్తులో సుజన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.