కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వామపక్ష పార్టీలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిపాయి. రాస్తారోకోలు, ప్రదర్శనలు, సభలు జరిపి కేంద్రం తీరుపై భగ్గుమన్నారు. విజయవాడలోని పాత బస్టాండ్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.