కోవిడ్ నాలుగో దాడి పేరుతో అనవసరంగా ఎలాంటి ఆంక్షల్ని విధించరాదని, అవసరమైనంత వరకే నిబంధనలు ఉండాలని ప్రధాని మోదీ సూచించారు, ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకున్నామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. బుధవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో జరిగిన సీఎంల వీడియో సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి గురించి చర్చించాను. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంది. ఈ నెల 9 తరువాత బెంగళూరులో పాజిటివ్ రేటు పెరిగింది అని చెప్పారు.