దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య బుధవారంతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటలలో 1,72,433 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,59,107 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, 1008 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,98,983 మంది కోవిడ్ బారినపడి మరణించారు.