భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,06, 064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 8.2 శాతం తక్కువ నమోదయ్యాయి. ఆదివారం 439 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,848కు పెరిగింది.