ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది పరిశ్రమ అపోహ మాత్రమేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుధవారం రోజున ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ నన్ను ఎంతో పెద్ద వాణ్ణి చేసిందని తెలిపారు. సినీ రంగాన్ని వదిలి కొన్నాళ్లు వేరే రంగానికి వెళ్లాను. తిరిగొచ్చాకే సినీ పరిశ్రమ విలువ మరింత తెలిసిందన్నారు. సినీ పరిశ్రమలోకి కొత్త తరం రావాలన్నారు.