కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చైనా నుంచి వందల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయారు. తాజాగా వీసాలపై నిరీక్షణకు తెరదించుతూ భారత విద్యార్థులకు చైనా శుభవార్త అందించింది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి చైనాకు వెళ్లేందుకు వీసాలు జారీ చేసే ప్రణాళిక చేస్తున్న ప్రకటించింది. స్టూడెంట్ వీసాలతో పాటు బిజినెస్ వంటి వివిధ కేటగిరీల వీసాలు సైతం జారీ చేయనున్నట్లు డ్రాగన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.