నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో 8 చీతాల్ని భారత ప్రభుత్వం ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చీతాల్ని తీసుకొచ్చిన విమానానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ విమానం ముందు భాగంలో పులి ముఖాన్ని పోలిన పెయింటింగ్ వేశారు. చీతాల్ని తీసుకొచ్చిన విమానం కాబట్టి, అది చీతాలకు సంబంధించిన చిత్రమే అని, వాటి కోసమే విమానానికి ప్రత్యేకంగా పెయింటింగ్ చేశారని చాలా మంది అనుకున్నారు. కానీ, అది చీతా పెయింటింగ్ కాదు. అదో పులి చిత్రం. పులి ముఖాన్ని పెయింటింగ్‌గా వేశారు. విమానం ముందు భాగంలో దాని ముక్కు, మీసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విమానం ఇండియాది కాదు.