పంజాబ్ ఎన్నికల్లో దగ్గరపడుతున్న వేళ సీఎం మేనల్లుడు అరెస్ట్ కావడం పట్ల రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గురువారం ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. సుమారు ఎనిమిది గంటల పాటు భూపీందర్‌ను విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు చేశారు.