హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అంటే ఒకప్పుడు చోరులు, దోపిడీ దొంగలు, బందిపోట్లకు హడల్. జూపార్క్‌లో పులి సాఖీని చంపిన సలావుద్దీన్ నుంచి పాతబస్తీలోని మహంకాళి ఆలయంలో చోరీకి పాల్పడిన గౌస్, సలీంల వరకు ఎందరో కరుడుగట్టిన నేరగాళ్లను అరెస్టు చేసిన ఘన చరిత్ర దీనికి ఉంది. కొంత కాలంగా నిర్వీర్యమైన సీసీఎస్ క్రైమ్ టీమ్స్‌ను పునరుద్ధరించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.