గడ్డిమోపులో పడ్డ చిన్న నిప్పు రవ్వను గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే చివరికి ఏమవుతుందో… శరీరానికి సోకిన క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించకపోతే అదే అనర్థం జరుగుతుంది. అందుకే కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్‌ని మొదట్లోనే గుర్తించగలిగితే ఎంతో ప్రమాదాన్ని నివారించగలుగుతాం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారిపోతాయి. అయితే క్యాన్సర్ రోగులందరిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కష్టం. తల నుంచి శరీరం కింది భాగం వరకు ఆయా అవయవ భాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి.