దేశరాజధానిలోని అధికారిక నివాసం నుంచి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన కుటుంబాన్ని భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించాయని మీడియా కథనాలు వెల్లడించాయి. దేశంలో కరోనా టీకా తప్పనిసరని వ్యతిరేకించే నిరసనకారులు భారీగా రాజధాని ఒట్టోవాకు చేరుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అధికారులు ప్రధానిని, ఆయన కుటుంబాన్ని రహస్యప్రాంతానికి పంపినట్లు తెలుస్తోంది.