కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కరోనా సోకింది. అయితే తనకు బాగానే ఉందని ట్రూడో సోమవారం ప్రకటించారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. పబ్లిక్ హెల్త్ నింబంధనలు పాటిస్తూ.. వారం రోజులపాటు దూరంగా ఉంటూనే పనిచేస్తానని పేర్కొన్నారు. అందరూ తప్పనిసరిగా కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ట్విటర్‌లో తెలిపారు.