జస్టిన్ లాంగర్ రాజీనామా నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌ను నియమించింది. ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. కాగా ఆసీస్ కోచ్‌గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్ విజ్ఞప్తి పట్ల బోర్డు సానుకూలంగా స్పందించలేదు.