బ్రిటీష్ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది. ఆ సంపద ఇప్పుడు మన చేతిలో ఉంటే ఇండియా రేంజ్ మరోలా ఉండేది. పాలన పేరుతో దశాబ్దాల పాటు భారత్‌ను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు బ్రిటీషర్లు. బంగారం, వజ్ర వైడూర్యాలు మొదలుకొని విలువైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. బ్రిటీషర్లు దేశాన్ని వదిలి పోయే నాటికి ఇక్కడ ఇంకేమీ మిగల్లేదు..! ఇప్పుడు ఆ సంపదంతా రాజ ప్రసాదాల్లోనూ, బ్రిటీష్ మ్యూజియంలోనూ ఉంది.