హాస్యబ్రహ్మ…నవ్వుల రారాజు.. కామెడీ కింగ్..కామెడీకి బ్రాండ్ అంబాసిడర్.. అసలు ఏ పేరుపెట్టి పిలవాలి? ఆయన కనుబొమ్మ అలా ఎగరేస్తే చాలు ప్రేక్షకుడి పొట్ట చెక్కలవ్వాల్సిందే. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పేరు తలుచుకుంటే చాలు మనం ఏమూడ్‌లో ఉన్నా చిరునవ్వు ఇట్టే వచ్చేస్తుంది.. దటీజ్ బ్రహ్మానందం. బహుశా అందుకే ఆయనకు చిన్నప్పుడే బ్రహ్మా..నందం అని పేరు పెట్టాశారేమో. టాలీవుడ్‌కు జంధ్యాల పరిచయం చేసిన తెలుగు మాస్టారు బ్రహ్మానందం బర్త్‌డే సందర్భంగా ఈ స్పెషల్ వీడియో మీకోసం…