కొంతమంది చిన్నారులు బాల్యం నుంచి మంచి ప్రతిభ కనబరుస్తారు. పైగా వేగవంతంగా నేర్చుకోవడమే కాక మంచి జ్ఞాపక శక్తి వారి సొంతం. అయితే ఇక్కడొక అమ్మాయి చాలా చిన్న వయసులోనే మంచి బాక్సర్‌గా రాణించడమే కాక ప్రపంచంలోనే బలమైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.
అసలు విషయంలోకెళ్లితే…రష్యాకి చెందిన రుస్త్రమ్ సాద్వాకాస్ అనే బాక్సర్‌కి 12 ఏళ్ల ఇవింక సావకస్ అనే కుమార్తె ఉంది. ఆమె చిన్నతనం నుంచి తన తండ్రి రుస్త్రమ్ వద్దే బాక్సింగ్ శిక్షణ తీసుకుంది. అయితే ఆయన తన కుమార్తె ప్రతిభను నాలగేళ్ల ప్రాయంలోనే గుర్తించారు. పైగా ఇవింకా తన కంటే పెద్ద విద్యార్థులు తీసుకునే శిక్షణను తీసుకునేదని తెలిపారు. అంతేకాదు కేవలం ఒక్క నిమిషంలోనే సుమారు 100 పంచ్‌లు విసిరేదని చెప్పారు.