మత మార్పిడుల నిరోధక బిల్లుకు శాసన మండలి మద్దతు లభించకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో మత మార్పిడులను అరికట్టడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కర్ణాటక మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ గత ఏడాది డిసెంబర్‌లో కర్ణాటక అసెంబ్లీలో ఆమోదం పొందింది. శాసన మండలిలో మాత్రం ఆమోదం పొందలేదు. పెండింగ్‌లో ఉండిపోయింది. మండలిలో అధికార బీజేపీకి తగిన మెజార్టీ లేకపోవడమే ఇందుకు కారణం.