అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా ఈ పేలుడు జరగటంతో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు.. 35 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తాలిబన్ నిఘా విభాగం అధికారి ఒకరు తెలిపారు.