ఆన్ లైన్ కోర్సులకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో అన్ని సంస్థలు ఆన్ లైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలానీ ఆన్‌లైన్ మోడ్‌లో బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రారంభించింది. ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ కోర్సును అందించనున్నారు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా స్ట్రీమ్‌లో 12వ తరగతి పాసైన విద్యార్థులు కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే కాలేజీల్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా కోర్సు కోసం అప్లై చేసుకోవచ్చు.