తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. సీజన్.. సీజన్‌కి ఈ షోకి ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా అలరించనుంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ ఐదో సీజన్ హోస్ట్ కింగ్ నాగార్జున స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.