బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కానీ, భారీ టీఆర్పీ అందుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. సెప్టెంబర్ 5న అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ డిసెంబర్ 19న ముగిసింది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో నటుడు, యాంకర్ వీజే సన్నీ విజేతగా నిలవగా యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్‌గా అవతరించాడు.