బిగ్‌బాస్ ఆరో సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. మొదటి వారం పూర్తయి, రెండో వారం నామినేషన్స్ కూడా అయ్యాయి. ఈ నామినేషన్స్ లో గొడవలు కూడా బాగానే జరిగాయి. ఇక మంగళవారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా ‘సిసింద్రీ’ టాస్క్ ఇచ్చారు. గతవారం కొంతమంది కెప్టెన్సీ పోటీకి డైరెక్ట్ వెళ్ళిపోయినా ఈ సారి మాత్రం కెప్టెన్సీ టాస్క్ ని అందరూ ఆడాల్సిందే.