బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ బెన్ మెక్‌డెర్మాట్ విధ్వంసం సృష్టించాడు. హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మెక్‌డెర్మాట్ 60 బంతుల్లో 110 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. తొలుత 50 పరుగులు 36 బంతుల్లో చేయగా, చివరి 60 పరుగులు కేవలం 24 బంతుల్లోనే సాధించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అడిలైడ్ స్ట్రైకర్స్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అడిలైడ్ బ్యాటరల్లో రెన్‌షా(63),వెదర్‌రాల్డ్(51) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. హోబర్ట్ బౌలరల్లో రిలే మెరెడిత్ మూడు వికెట్లు పడగొట్టగా,రోజర్స్, ఇల్స్ చెరో వికెట్ సాధించారు.