విజయ్ ఆంటోని ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నారు. సంగీత దర్శకుడి నుంచి కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు విజయ్ ఆంటోని. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రానికి రత్తం అనే టైటిల్‌ను ఆదివారం ఖరారు చేశారు. ఇందులో నటి మహిమ నంబియార్, నందిత శ్వేత, రమ్యానంబీశన్ కథానాయికలుగా నటించడం విశేషం. హాస్యనటుడు జగన్ కృష్ణ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.