బెంగళూరును కనీవిని ఎరుగని వరదలు ముంచెత్తడానికి కారణం అక్రమ నిర్మాణాలు, నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలు, డ్రైనేజీ నిర్వహణ వ్యవస్థ సరిగా లేకపోవడమే. ఏ పెద్ద నగరాన్ని వరదలు ముంచెత్తినా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడటం సహజం. కానీ, ఈసారి బెంగళూరు వరదల్లో పెద్ద సంఖ్యలో సంపన్నులు కూడా అష్టకష్టాలు పడ్డారు. వారిలో విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ, స్టార్టప్ లతో సంపద పోగేసుకున్న బైజూస్ రవీంద్రన్, బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ, బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ అభినయ్ చౌదరి వంటి వారు ఉన్నారని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.