పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘బీఈ బార్’. ‘కావల్ తురై ఉంగళ్ నన్బన్’ వంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని రూపొందించిన టీమ్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ‘కావల్ తురై ఉంగళ్ నన్బన్’ మూవీ ఫేమ్ సురేష్ రవి కథానాయకుడి గానూ, ‘చతురంగ వేట్టై’ సినిమా ఫేమ్ ఇషార నాయకి గాను నటిస్తున్న ఇందులో తంబి రామయ్య, లివింగ్ట్సన్, కల్లూరి వినోద్, మధు, రేణుక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.