పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసియా కప్ కొట్టాలని కంకణం కట్టుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాక్ కెప్టెన్ కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. కొడితే సెంచరీ లేదంటే అర్థసెంచరీలుగా సాగుతుంది బాబర్ ఇన్నింగ్స్. ఒకప్పటి కోహ్లిని తలపిస్తోన్న బాబర్ ఆజంను కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు సవాల్‌గా మారిపోయింది. ఇక గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలోనూ బాబర్ అర్థ సెంచరీతో మెరిశాడు.