బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ తిరస్కరించింది. కరీంనగర్‌లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. తనపై కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని బండి సంజయ్ విన్నవించారు. అత్యవసర విచారణ చేపట్టాలన్న సంజయ్ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది.