వీటితో పాటు ఎముకలు, కండరాల ఆరోగ్యానికి దోహదపడుతూ.. నాడీ వ్యవస్థ పని విధానాన్ని ప్రభావితం చేయగలిగే కాల్షియం కూడా ఉంటుంది. మరి, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న అరటిని, పాలను కలిపి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఎన్టీటీవీ తన కథనంలో పేర్కొన్న అంశాలు మీకోసం.. డైటీషియన్, సైకాలజిస్ట్ హరీశ్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. ‘‘అరటిని పాలతో కలిపి తినమని నేను సిఫార్సు చేయలేను. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు.