ఏ కంపెనీ అయిన టాలెంట్‌ని పరిగణలోకి తీసుకునే ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుంది. కొన్ని కంపెనీలు ఐతే ఇన్నేళ్లు అనుభవం ఉంటేనే రిక్రూట్ చేసుకుంటానని ముందే చెబుతున్నాయి. కానీ ఇక్కడోక వ్యక్తిని కేవలం లావుగా ఉన్నాడంటూ విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే…ఆస్ట్రేలియాకు చెందిన హమీష్ గ్రిఫిన్ క్వీన్స్‌లాండ్‌లో ఎనిమిదేళ్లుగా పార్క్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పైగా అతని సొంత ఇంటికి ఆఫీస్ సుమారు 3,200 కి.మీ దూరం. కాగా అతను ఇటీవలే ఆఫీస్‌కి దగ్గరగా ఉండేలా ఇల్లు కూడా మారాడు. అయితే ఉన్నట్టుండి అతని కంపెనీ యజమాని నువ్వు చాలా లావుగా ఉన్నావు పనిచేయలేవు అని చెప్పి విధుల నుంచి తొలగించేశారు.