నమ్మి ఇల్లు బాడుగకు ఇస్తే ఖాళీ చేయకుండా తననే బయటికి గెంటేశాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రుద్రంపేటకు చెందిన జమ్మటపాటి శాంతమ్మ తనకు జరిగిన అన్యాయాన్ని ఆదివారం విలేకరులకు వెల్లడించింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. రుద్రంపేట గ్రామ సర్వే నెంబర్ 82–3బీలోని 3 సెంట్లలో శాంతమ్మకు రేకుల షెడ్డు ఉంది. 2002లో సూర్యనారాయణరెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలసి ఇంటిని బాడుగకు తీసుకున్నాడు. ఇటీవల సూర్యనారాయణరెడ్డి తీరుపై శాంతమ్మ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని కోరారు.