ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (ఏఎస్పీ) పని చేస్తున్న ఎం.ముని రామయ్యపై హైదరాబాద్ సెంట్రల్ క్రై మ్ స్టేషన్‌లో (సీసీఎస్) చీటింగ్ కేసు నమోదైంది. ఓ డమ్మీ డీఎస్పీని రంగంలోకి దింపి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి నేరానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ముని రామయ్యకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. మరోపక్క ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ఏపీ అధికారులకు సమగ్ర నివేదిక సమర్పించారు.