టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. అశోక్‌బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు.. గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అశోక్‌బాబు అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.