బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో అరెస్టై, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ కోర్టు విచారణలో బోరున విలపించారు. బుధవారం ఈ కేసుకు సంబంధించి ఇద్దరినీ కోర్టు వర్చువల్ పద్ధతిలో విచారించింది. ఈ సందర్భంగా ఇద్దరూ కంటతడి పెట్టుకుని, ఆవేదన చెందినట్లు తెలుస్తోంది.