విద్యుత్ ఉద్యోగులు డీఏ విషయంలో త్వరలోనే శుభవార్త వింటారని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ద్వితీయ వార్షికోత్సవం, విద్యుత్ సంస్థల నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను విజయవాడలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు.
13 జిల్లాల నుంచి ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, మూడు డిస్కంలు, నెడ్‌క్యాప్, ఏపీఎస్‌ఈసీఎం, ఏపీసీడ్కో విభాగాల ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలినేని ప్రసంగిస్తూ..పే రివిజన్ కమిటీతో జీతాలు తగ్గుతా యని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఉద్యోగులెవరూ పట్టించుకోవలసిన అవసరం లే దని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇ బ్బందులను పరిగణనలోకి తీసుకుని వారికి న్యాయం జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటా మని మంత్రి భరోసా ఇచ్చారు.