ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డిని ఈఓగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. టీటీడీ ఈఓగా నియమించేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసి.. ధర్మారెడ్డిని అదనపు ఈఓగానే కొనసాగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.