కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిపై అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. వాటిపై ఆషామాషీగా నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా పరిశీలించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు.