ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్ని అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 75 మంది మరణించారు. ఇరాన్ పాలకుడు అయతొల్లా అలీ ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ, అయనను నియంతగా వర్ణిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అయతొల్లా పాలన అంతం కావాలని ఆందోళనకారులు నినదిస్తున్నారు. ఇరాన్‌లో గత 13 ఏళ్లుగా ఎప్పుడూ ఈ స్థాయిలో ఆందోళనలు జరగలేదు.