ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో, ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనాలు పలికారు. ఇక ఈ మూవీలో బన్నీ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఆయన కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.