బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో ఆకస్మిక పర్యటన సొంత పార్టీతో పాటు అంతటా చర్చనీయాంశమైంది. అమిత్‌షా నేడు మంగళవారం జరిగే బసవ జయంతి ఉత్సవంలో పాల్గొంటారు. ఇందులో సీఎం బొమ్మై, పార్టీ అగ్రనేతలు, మంత్రులు కూడా ఉంటారు. అనంతరం అమిత్ షా ఆర్టీ నగరలోని సీఎం బొమ్మై ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం సీఎం నివాసంలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.