అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చైనా తైవాన్ చుట్టూతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గస్తీ కాయడమే కాకుండా సైనిక కసరత్తులు ప్రారంభించింది కూడా. అంతేగాక తైవాన్‌ని భయభ్రాంతులకు గురిచేసేలా సైనిక విన్యాసాలను కొనసాగించింది.
పెలోసీ పర్యటన పూర్తయినప్పటికీ తన విన్యాసాలను కొనసాగించడమే కాకుండా తైవాన్ చుట్టూత తమ ఆర్మీ కార్యకలాపాలు పూర్తి అయ్యాయని, యుద్ధం చేయడమే తరువాయి అన్నట్లు ప్రకటించింది. పైగా ఏ క్షణమైన యుద్ధం చేసేందుకు రెడీ పైగా తైవాన్ సరిహద్దులో తన ఆర్మీ డ్రిల్ కొనసాగుతుందని కరాఖండిగా చెప్పేసింది. దీంతో నాన్సీ పెలోసి ఈ విషయమై స్పందించి…కేవలం తైవాన్‌ని ప్రశంసించడానికే వెళ్లాం.స