ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ మెట్రో పిల్లర్‌ను ఢీకొని ఓ డెలివరీ బాయ్ మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికిరణ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి… కృష్ణా జిల్లా, పునాదిపాడు మండలం, కంకిపాడు గ్రామానికి చెందిన రావూరి దుర్గప్రసాద్(37) మియాపూర్‌లోని ప్రజయ్ సిటీలోని బ్లాక్ నంబర్.5లో ఉంటూ అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య శ్రావణి, మూడేళ్ల పాప ఉన్నారు.