ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు ఆయన నాయకత్వం వహించారు.