జిల్లాలో మరో హత్య జరిగింది. మూఢనమ్మకాలు, పాతకక్షల నేపథ్యంలో గతనెల 20న జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌కు చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా చంపిన ఘటనను మరువక ముందే ఈ హత్య జరగడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో లచ్చనాయక్ తండాకు చెందిన భూక్య లక్ష్మణ్ (24) చనిపోయాడు.