మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించలేదని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఖండించారు. ఆదివారం ఆయనొక ప్రకటన చేస్తూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంబందించిన బిల్లులను వంట వారికి, కాంట్రాక్టర్లకు డిసెంబర్ వరకు పూర్తిగా చెల్లించామని స్పష్టం చేశారు. ‘బిల్లులను అప్‌లోడ్ చేసిన వెంటనే ఆటో డెబిట్ సిస్టం ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలిచ్చారు.