ఐటీ సిటీలో కొంతకాలంగా వినిపించని యాసిడ్ దాడి మళ్లీ తెర మీదకు వచ్చింది. సుంకదకట్టలో ఒక యువతిపై దుండగుడు యాసిడ్ దాడి చేశాడు. స్థానిక ముత్తూట్ ఆఫీసులో ఓ యువతి (23) పని చేస్తోంది. నాగేశ్ అనే యువకుడు రోజూ ఆమె వెంటపడి ప్రేమించాలని అడిగేవాడు. గురువారం ఉదయం 8:30 సమయంలో కూడా అదే మాదిరిగా ఆఫీసు వద్దకు వచ్చి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు.