రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. వివరాలు… మాన్విలో రంగరేజ్(40),నూరుస్లు కిరాణా అంగడి నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసి ఇద్దరూ బైక్‌లో ఇంటికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. రంగరేజ్ అక్కడికక్కడే మృతి చెందగా నూరుస్ గాయపడింది. పోలీసులు క్షతగాత్రురాలిని రిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.